
Stock Market Today: జీఎస్టీ మండలి భేటీ వేళ.. ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి. జీఎస్టీ (GST)లో నూతన సంస్కరణలపై ఈ రోజు,రేపు జరగబోయే జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించనున్నారు ఈ నేపధ్యంలో మదుపర్లు జాగ్రత్తగా పరిస్థితులను పరిశీలిస్తూ ట్రేడింగ్ చేస్తున్నారు. అంతేకాక,అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల కారణంగా స్థానిక సూచీలు తేడాలతో కదులుతున్నాయి.
వివరాలు
నిఫ్టీ @ 24,573
ఉదయం 9.34 గంటలకు సెన్సెక్స్ 33.34 పాయింట్ల నష్టంతో 80,126 వద్ద కదులుతున్నది. అదే సమయంలో నిఫ్టీ 5.9 పాయింట్లు తగ్గి 24,573 వద్ద ట్రేడవుతోంది. రూపాయి, తన జీవితకాల కనిష్ఠ స్థాయికి చేరిన తరువాత, కొంత కోలుకొని డాలర్‌తో పోలిస్తే 88.12 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, టీసీఎస్, సిప్లా, హిందాల్కో షేర్లు లాభాలతో ఉన్నా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, శ్రీరామ్ ఫైనాన్స్, ఆసియన్ పెయింట్స్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టంతో ముగియగా, నేడు ఆసియా మార్కెట్లు కూడా అదే దిశలో కదులుతున్నాయి.