Page Loader
Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ @ 22,920 
లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ @ 22,920

Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ @ 22,920 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 07, 2024
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

మానిటరీ పాలసీ కమిటీ సమావేశానికి ముందు శుక్రవారం స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ఒడిదుడుకులతో ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లు జారి 75,000 పాయింట్ల దిగువకు చేరుకుంది. మరోవైపు నిఫ్టీ కూడా 22,800 స్థాయికి చేరుకుంది. అయితే, ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలు తమ నష్టాలను పూడ్చుకోగలిగాయి, మార్కెట్ తిరిగి ఊపందుకుంది. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 386.02 (0.51%) పాయింట్ల లాభంతో 75,460.53 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 121.55 (0.53%) పాయింట్లు బలపడి 22,942.95 స్థాయికి చేరుకుంది. ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి రూ.83.46కు చేరుకుంది.

Details 

మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో విప్రో,టెక్‌ మహీంద్రా,ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌,హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్, టైటన్‌, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ,కోటక్ మహీంద్రా బ్యాంక్‌,ఐటీసీ,భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి.యురోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు 25 పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ ఆయిల్ ధర 79.99 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.విదేశీ సంస్థాగత మదుపర్లు(FIIs)గురువారం నికరంగా రూ.6,868 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు(DIIs)రూ.1,566 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.