LOADING...
Stock market: స్తబ్దుగా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు.. నిఫ్టీ@ 24,683
స్తబ్దుగా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు.. నిఫ్టీ@ 24,683

Stock market: స్తబ్దుగా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు.. నిఫ్టీ@ 24,683

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్తబ్దుగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్పష్టతలేని సంకేతాలు వస్తుండటంతో భారతీయ సూచీలు ఒడిదుడుకుల మధ్య కదలాడుతున్నాయి. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9.38 గంటల సమయంలో సెన్సెక్స్‌ 31.11 పాయింట్లు నష్టపోయి 80,859 స్థాయిలో ట్రేడవుతోంది. అదే సమయంలో నిఫ్టీ 24,683 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

విదేశీ కరెన్సీతో పోలిస్తే రూపాయి 86.83గా నమోదు 

విదేశీ కరెన్సీతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.83గా నమోదైంది. నిఫ్టీ సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జియో ఫైనాన్షియల్‌, ఓఎన్‌జీసీ, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్‌ షేర్లు లాభాలను నమోదు చేస్తున్నాయి. మరోవైపు భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎటర్నల్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు, నిన్న అమెరికా స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. తాజా ట్రేడింగ్ సెషన్‌లో ఆసియా మార్కెట్లు కూడా నష్టాలతో కదలాడుతున్నాయి.