
Stock market: సూచీలకు కలిసొచ్చిన ఐటీ షేర్లు.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభలలో ముగిసాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. సెప్టెంబర్ 11న జరిగే బోర్డు సమావేశంలో కొన్ని కంపెనీల షేర్ల బైబ్యాక్ అంశంపై నిర్ణయం తీసుకోనుండడంతో ఇన్ఫీ షేర్లు నేడు రాణించాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్ షేర్లు కూడా సూచీల ఎదుగుదలకు మద్దతుగా నిలిచాయి. అంతే కాకుండా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నదని మార్కెట్‌లో ఏర్పడిన అంచనాలు కూడా మన సూచీలను ప్రోత్సహించాయి. సెన్సెక్స్ సూచీ ఉదయం 81,129.69 పాయింట్ల వద్ద ప్రారంభమై,గత ముగింపు స్థానం 80,787.30 పాయింట్లతో పోల్చితే మంచి లాభాన్ని నమోదు చేసింది. రోజంతా మంచి ట్రెండ్ కొనసాగుతూ, ఇంట్రాడేలో గరిష్ఠంగా 81,181.37 పాయింట్ల స్థాయిని తాకింది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 66.55 డాలర్లు
చివరికి 314 పాయింట్ల లాభంతో 81,101.32 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ 95.45 పాయింట్ల లాభంతో 24,868.60 వద్ద ముగిసింది. అలాగే,డాలర్ మారకం విలువ 88.10 రూపాయలుగా నమోదైంది. సెన్సెక్స్ 30 కంపెనీలలో ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా,అదానీ పోర్ట్స్,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,టీసీఎస్ షేర్లు ముఖ్యంగా లాభపడ్డాయి. మరోవైపు, ట్రెంట్, ఎటెర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, టైటాన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల పరిస్థితే మిశ్రమంగా కనిపించింది. కోస్పీ, హాంగ్‌సెంగ్ సూచీలు లాభంలో కొనసాగగా, జపాన్ నిక్కీ సూచీ నష్టపోయింది. యూరోపియన్ మార్కెట్లు ప్రస్తుతం మిశ్రమ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 66.55 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 3,653.04 డాలర్ల స్థాయిలో కొనసాగుతోంది.