Page Loader
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,900 
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,900

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,900 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశాలు కనిపించడంతో మదుపర్ల భయాలు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టెహ్రాన్‌ను విడిచిపెట్టి వెళ్లాలని పౌరులకు సూచించడమే ఈ ఆందోళనలకు కేంద్ర బిందువైంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ప్రాంతీయ స్థాయిలో యుద్ధ వాతావరణాన్ని తెచ్చే అవకాశమున్నందున మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో పాటు, చమురు ధరలు పెరగడంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా, సెన్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా తగ్గగా, నిఫ్టీ 24,900 స్థాయికి దిగువన కుదించుకుంది. సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 81,869.47 వద్ద స్వల్ప లాభాలతో మొదలైంది(మునుపటి ముగింపు 81,796.15).

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 74.28 డాలర్లు 

కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది.రోజంతా కనిష్ఠంగా 81,427.01 పాయింట్లను తాకిన తరువాత, చివరికి 212 పాయింట్ల నష్టంతో 81,583.30 వద్ద నిలిచింది. నిఫ్టీ సూచీ 93.10 పాయింట్ల నష్టంతో 24,853.40 వద్ద ముగిసింది.మారకదరాల్లో డాలరుతో రూపాయి విలువ 86.24 వద్ద స్థిరంగా ఉంది. సెన్సెక్స్‌ 30 షేర్లలో టాప్‌ లూజర్లుగా ఎటర్నల్‌,సన్‌ ఫార్మా,టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ నిలిచాయి. అదే సమయంలో,టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ సుజుకీ, టీసీఎస్‌ లాంటి కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ స్థాయిలో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 74.28 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు, బంగారం ధర ఔన్సుకు 3,405 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.