
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్..
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగాన్ని తప్పితే మిగతా అన్ని రంగాల్లోనూ కొనుగోళ్ల జోరు కనిపించింది.
గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే మార్కెట్ స్వల్ప లాభాలతో ప్రారంభమైంది.
సెన్సెక్స్ 80,661.62 పాయింట్ల వద్ద ప్రారంభమై, అదే ధోరణిని ట్రేడింగ్ ముగిసే వరకు కొనసాగించింది.
ట్రేడింగ్‌లో సెన్సెక్స్ కనిష్ఠంగా 80,657.71 పాయింట్లను తాకగా, గరిష్ఠంగా 81,049.03 పాయింట్లను అధిగమించింది.
చివరికి ఈ సూచీ 294.85 పాయింట్లు పెరిగి 80,796.84 పాయింట్ల వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సూచీ 114.45 పాయింట్లు లాభపడి 24,461.15 వద్ద ముగిసింది.
మొత్తంగా మార్కెట్లో దాదాపు 2,462 షేర్లు లాభాల్లో నమోదవ్వగా, 1,404 షేర్లు నష్టపోయాయి. మరో 171 షేర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
వివరాలు
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కోటి ఒక శాతం కంటే ఎక్కువ పెరిగాయి
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కోటి ఒక శాతం కంటే ఎక్కువ పెరిగాయి.
బ్యాంకింగ్ రంగాన్ని మినహాయిస్తే, ఆటోమొబైల్, పవర్, ఎనర్జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్ రంగాలన్నీ దాదాపు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి.
నిఫ్టీలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం కంపెనీలు అత్యధిక లాభాలు నమోదు చేశాయి.
మరోవైపు, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ముగిశాయి.