
Stock Market: 1,600 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్.. 22,600 పైన పెరిగిన నిఫ్టీ..
ఈ వార్తాకథనం ఏంటి
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో గత సెషన్‌లో పడిపోయిన స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి ఊపందుకున్నాయి.
అమెరికా టారిఫ్‌లపై ఇతర దేశాలతో చర్చలకు సిద్ధంగా ఉందన్న సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఊత్సాహాన్ని రేకెత్తించాయి.
ఆసియా మార్కెట్లతో పాటు భారత మార్కెట్లు కూడా లాభాల్లోకి వచ్చాయి.
ఇంకా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈసారి వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించవచ్చన్న అంచనాలు కూడా కలిసొచ్చాయి.
ఈ నేపథ్యంలో, సెన్సెక్స్ 1600 పాయింట్లకుపైగా లాభంతో ట్రేడవుతుండగా, నిఫ్టీ 22,600 మార్కును దాటి పోయింది.
బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ సుమారు ₹4.50 లక్షల కోట్ల మేర పెరిగింది.
వివరాలు
2% కంటే ఎక్కువ లాభాల్లో.. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 & స్మాల్‌క్యాప్ 100
మధ్యాహ్నం 12.50 సమయానికి సెన్సెక్స్: 1600 పాయింట్ల లాభంతో 74,744.86 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ: 492 పాయింట్ల లాభంతో 22,654.10 వద్ద ఉంది.కన్జూమర్ డ్యూరబుల్ ఇండెక్స్: 3% లాభంతో ట్రేడవుతోంది. మెటల్, రియల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు: సుమారు 2% మేర లాభాల్లో ఉన్నాయి.
నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 & స్మాల్‌క్యాప్ 100: రెండూ 2% కంటే ఎక్కువ లాభాల్లో ఉన్నాయి.
ఇండియా విక్స్ (మార్కెట్ వోలటిలిటీ): 10.2% తగ్గి 20.47కి చేరింది.బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి,ముఖ్యంగా టైటాన్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, జొమాటో, ఎస్‌బీఐ రాణిస్తున్నాయి.
ఆసియా-పసిఫిక్ మార్కెట్ల దృష్టిలోకి వెళితే: జపాన్ నిక్కీ ఇండెక్స్ 5.68% లాభంతో ట్రేడవుతోంది. హాంగ్‌కాంగ్, షాంఘై మార్కెట్లు సుమారు 1.5% లాభాల్లో ఉన్నాయి.
వివరాలు
అమెరికా మార్కెట్ల పరిస్థితి (సోమవారం సెషన్‌లో):
డోజోన్స్: 0.91% తగ్గింది
ఎస్‌అండ్‌పీ 500: 0.23% దిగజారింది
నాస్‌డాక్: 0.10% లాభంతో ముగిసింది
నిపుణుల అంచనా ప్రకారం, మంగళవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియవచ్చని భావిస్తున్నారు.
వివరాలు
ప్రధాన కారణాలు:
సుంకాలపై కొన్ని దేశాలు చర్చలకు సిద్ధంగా ఉన్నాయన్న ట్రంప్ ప్రకటన మార్కెట్లలో నమ్మకాన్ని కలిగించింది.
ట్రంప్ తాము పెట్టిన టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్ ప్రభావం తక్కువ: చైనా,వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే భారత్‌పై అమెరికా టారిఫ్‌ల ప్రభావం తక్కువగా ఉంటుందని భావించడంవల్ల ఇన్వెస్టర్ల ఆందోళనలు తగ్గాయి.
క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం: ముడిచమురు ధరలు తగ్గడంతో మార్కెట్లు ఊతం పొందాయి. తక్కువ స్థాయిల వద్ద కొనుగోళ్లు సూచీలను పెంచాయి.
వివరాలు
ప్రధాన కారణాలు:
ఆర్‌బీఐ పాలసీ అంచనాలు: సోమవారం ప్రారంభమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు బుధవారం (ఏప్రిల్ 9) ఫలితాలు ప్రకటించనున్నాయి. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించవచ్చన్న అంచనాలు మార్కెట్‌కు ఉత్సాహాన్ని కలిగించాయి.
అమెరికా బాండ్ల రాబడులు తగ్గడం: 10 ఏళ్ల బాండ్ల యీల్డ్ 4.5% నుండి 4.14%కి, 2 ఏళ్ల బాండ్ల యీల్డ్ 3.715%కి తగ్గింది. డాలర్ ఇండెక్స్ 102.92కి పడిపోవడం కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనుకూలంగా మారింది.