Stock Market : భారీ నష్టాలలో స్టాక్ మార్కెట్ .. నిఫ్టీ@23,440
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ 79 పాయింట్లు నష్టపోయి 23,448 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 229 పాయింట్లు తగ్గి 77,395 వద్ద కొనసాగుతుంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 109.2 పాయింట్ల వద్దకు చేరుకుంది.
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 77.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.69 శాతానికి చేరాయి.
గత సెషన్‌లో అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపోయింది. నాస్‌డాక్ 0.06 శాతం తగ్గింది.
వివరాలు
మార్కెట్ రేటింగ్‌కు హెచ్‌ఎస్‌బీసీ కోత..
అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ భారత ఈక్విటీ మార్కెట్ రేటింగ్‌ను 'ఓవర్‌వెయిట్' నుంచి 'న్యూట్రల్'గా తగ్గించింది.
కార్పొరేట్ ఆదాయాల నెమ్మదించడాన్ని, అధిక వాల్యుయేషన్లను దీనికి కారణాలుగా చేర్చింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను నిఫ్టీ 50 కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను 15% నుంచి 5%కే తగ్గించింది.
ఈ ఏడాది చివరిలో సెన్సెక్స్ 85,990 స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. గురువారం సెన్సెక్స్ ముగింపు (77,620)తో పోలిస్తే ఇది 10% మాత్రమే అధికం.