Page Loader
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్‌
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు..

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, ఐటీసీ వంటి కీలక షేర్లలో అమ్మకాలు జరగడం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీంతో ప్రారంభ సమయంలోనే సెన్సెక్స్‌ సుమారు 400 పాయింట్ల మేర నష్టపోయింది. అనంతరం అది మరింతగా నష్టాల్లోకి జారుకుంటోంది. ఉదయం 9:26 గంటల సమయంలో, సెన్సెక్స్‌ 678 పాయింట్ల నష్టంతో 80,918 వద్ద, నిఫ్టీ 207 పాయింట్ల నష్టంతో 24,605 వద్ద ట్రేడవుతున్నాయి.

వివరాలు 

సెన్సెక్స్‌-30 సూచీ

సెన్సెక్స్‌-30 సూచీలో టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌, మారుతీ సుజుకీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే అదానీ పోర్ట్స్‌,టాటా స్టీల్‌,ఎన్టీపీసీ షేర్లు మాత్రమే లాభాల్లో కదలాడుతున్నాయి. ఇక అమెరికా స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి.ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.61 శాతం, డోజోన్స్‌ 1.91 శాతం,నాస్‌డాక్‌ 1.41 శాతం మేర నష్టపోయాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లూ ఈ నేఫథ్యంలో అదే దారిలో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియాలోని ఏఎస్‌ఎక్స్‌ 0.50 శాతం నష్టంలో ఉండగా,జపాన్‌ నిక్కీ 0.89 శాతం,హాంగ్‌సెంగ్‌ 0.70 శాతం,0.35 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.షాంఘై సూచీ మాత్రం స్థిరంగా కదులుతోంది.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 64.86 డాలర్లు 

అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 64.86 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు ధర 3,342 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చితే 85.61 వద్ద ప్రారంభమైంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మళ్లీ కొనుగోలుదారులుగా మారారు. బుధవారం ఒక్కరోజే వారు నికరంగా రూ.2,202 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) కూడా నికరంగా రూ.684 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.