Stock market : నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. 23,450 దిగువకు నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు, రోజు అంతా ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి.
చివరికి వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు లాభపడినప్పటికీ, ఫైనాన్షియల్, హెల్త్, ఆటోమొబైల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 23,450 దిగువకు చేరుకుంది.
సెన్సెక్స్ ఉదయం 77,682.59 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది, క్రితం ముగింపు 77,620.21. తరువాత లాభనష్టాల మధ్య కదలాడింది.
ఇంట్రాడేలో 77,919.70 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ, మధ్యాహ్నం తర్వాత పూర్తిగా నష్టాల్లోకి జారుకుంది.
చివరికి 241.30 పాయింట్ల నష్టంతో 77,378.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 23,431 వద్ద ముగిసింది.
వివరాలు
డాలరు @85.96
డాలరుతో రూపాయి మారకం విలువ మరో 10 పైసలు క్షీణించి 85.96కు చేరుకుంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి.
టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభపడ్డాయి.
అంతర్జాతీయ మార్కెట్లో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 78.73 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 2700 డాలర్ల మార్కు దాటి 2706 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.