LOADING...
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్.. నిఫ్టీ@24600 
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్.. నిఫ్టీ@24600

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్.. నిఫ్టీ@24600 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలుతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో ఉదయం సూచీలు సాధారణ స్థాయిలో ప్రారంభమైనా, ఆ తర్వాత మొత్తం రోజంతా లాభాల‌తోనే ట్రేడింగ్ జరిగింది. దీంతో వరుసగా మూడు రోజుల పాటు నష్టాల‌తో ముగిసిన సూచీలకు ఈ రోజు విశ్రాంతి లభించింది. ఉదయం సెన్సెక్స్ 80,737.51 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ,80,777.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. సూచీ ఇంట్రాడేలో 80,705.18 నుంచి 81,087.29 పాయింట్ల మధ్య కదలాడింది. ప్రధాన కంపెనీల షేర్లపై కొనుగోళ్లతో సూచీ చివరకు 260 పాయింట్ల లాభంతో 80,998 వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ ఇంట్రాడేలో గరిష్ఠంగా 24,644.25 పాయింట్లను తాకి, రోజును 77 పాయింట్ల లాభంతో 24,620.20 వద్ద ముగించింది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ బారెల్ ధర 65.93 డాలర్లు 

సెన్సెక్స్ 30లో ఎటర్నల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ షేర్లు మంచి లాభాలు సాధించాయి. అయితే, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, టైటాన్, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎస్‌బీఐ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నారు. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బారెల్ ధర 65.93 డాలర్ల వద్ద నిలిచే సమయంలో, బంగారం ధర 3,387 డాలర్ల దగ్గర ట్రేడింగ్ కొనసాగుతోంది. లిస్టింగుల విషయంలో ప్రధాన బోర్డు ద్వారా వచ్చిన స్కోడా ట్యూబ్స్ ఐపీఓ నేడు స్టాక్ మార్కెట్లో ప్రవేశించింది.

వివరాలు 

SME విభాగంలో నెఫ్ట్యూన్ పెట్రోకెమికల్స్ షేర్లు దలాల్ స్ట్రీట్‌లో లిస్ట్ అయ్యాయి

ఇష్యూ ధర రూ.140 కాగా, అదే ధర వద్ద షేర్లు లిస్ట్ అయ్యాయి. ఇంట్రాడేలో ఈ షేర్లు 5 శాతం లాభంతో ట్రేడయ్యాయి. రోజును ఎన్‌ఎస్‌ఈలో రూ.147 వద్ద 5 శాతం లాభంతో ముగించాయి. అలాగే, SME విభాగంలో నెఫ్ట్యూన్ పెట్రోకెమికల్స్ షేర్లు దలాల్ స్ట్రీట్‌లో లిస్ట్ అయ్యాయి. ఇష్యూ ధర రూ.122 కాగా, ఎస్‌ఎస్‌ఈలో రూ.132.75 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇంట్రాడేలో బాగా మెరుగు పొందిన ఈ షేర్లు, రోజును ఎన్‌ఎస్‌ఈలో రూ.139 వద్ద 14 శాతం లాభంతో ముగించాయి.