
Gold Rates : గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధర.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
మహిళలు ఎప్పుడూ పట్ల ప్రత్యేక అమితంగా ఇష్టపడేది బంగారం. చిన్న ఫంక్షన్లు, పెళ్లీల సమయంలో వారు ఎక్కువగా బంగారం ధరించడానికే ఇష్టపడుతుంటారు. కానీ ఈ రోజుల్లో బంగారం కొనడం సాధారణ ప్రజలకు భారంగా మారింది. కారణం ప్రతి రోజు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటికే తులం బంగారం ధర లక్ష మార్క్ దాటి పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. నేడు సెప్టెంబర్ 09 మంగళవారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,370 గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 99,340 గా నమోదైంది.
వివరాలు
ప్రాంతాల వారీగా చూస్తే…
సెప్టెంబర్ 08 సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,380 ఉండగా, నేడు రూ.10 తగ్గిపోయి రూ.1,08,370కి చేరింది. అదే విధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం రోజున రూ. 99,350 ఉండగా, మంగళవారం రూ.10 తగ్గి రూ.99,340గా నమోదైంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,370గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,340 వద్ద ఉంది. విజయవాడలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,370గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,340గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే... నేడు స్వల్పంగా తగ్గుదల కనిపించింది.