Page Loader
Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు!
పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు!

Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన దేశంలో ఏ చిన్న శుభకార్యం అయినా బంగారం కొనుగోలుతో ప్రారంభించేవారు చాలామంది. పసిడికి ఉన్న ప్రత్యేక స్థానం, సంపదగా భావించబడటమే ఇందుకు కారణం. ముఖ్యంగా భారతీయ మహిళలు నగలపై ఎంతో మక్కువ చూపిస్తారు. అయితే ఇటీవల బంగారం ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు కొనసాగుతుండగా, తాజాగా మరోసారి భారీగా పెరగడం వల్ల వినియోగదారులకు షాక్ తగిలింది. ఈ రోజు బంగారం ధరలు రూ.1,400 వరకు పెరిగాయి. దీంతో సాధారణ ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. నిన్నటి ధరతో పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,300 పెరిగి రూ.90,800కి చేరుకుంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,420 పెరిగి రూ.99,060గా నమోదైంది.

Details

వెండి ధరలు కూడా పెరిగాయ్

ఇటు వెండి ధరలు కూడా నేడు భారీగా పెరిగాయి. కిలో వెండి రూ.300 పెరిగి రూ.1,11,100కి చేరుకుంది. హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు 22 క్యారెట్ల బంగారం - రూ.90,800 24 క్యారెట్ల బంగారం - రూ.99,060 విజయవాడలో నేటి బంగారం ధరలు 22 క్యారెట్ల బంగారం - రూ.90,800 24 క్యారెట్ల బంగారం - రూ.99,060 ధరలు ఈ విధంగా పెరుగుతున్న నేపథ్యంలో, బంగారం కొనుగోలు చేయాలంటే వినియోగదారులు కొంత వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.