Page Loader
Gold Rates: ఒక్కరోజులోనే షాక్.. బంగారం ధర రూ.2,400 పెంపు
ఒక్కరోజులోనే షాక్.. బంగారం ధర రూ.2,400 పెంపు

Gold Rates: ఒక్కరోజులోనే షాక్.. బంగారం ధర రూ.2,400 పెంపు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

నిన్నటితో పోలిస్తే బంగారం ధరల్లో భారీ మార్పు చోటు చేసుకుంది. నిన్న తులం బంగారం ధర రూ.490 తగ్గిన విషయం తెలిసిందే. అయితే నేడు అదే బంగారం ధర రూ.2,400 మేర పెరిగింది. దీంతో కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.3,000 మేర పెరగడం గమనార్హం.

Details

హైదరాబాద్‌లో తాజా ధరలు ఇలా ఉన్నాయి 

24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.9,742 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.8,930 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగి రూ.89,300కి చేరింది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,400 పెరిగి రూ.97,420 వద్ద ట్రేడ్ అవుతోంది విజయవాడ, విశాఖపట్నాల్లో కూడా ఇదే ధరలు అమలులో ఉన్నాయి దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,450 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,570

Details

 వెండి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,11,000 ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,000 వద్ద ట్రేడ్ అవుతోంది. పసిడి, వెండి ధరలు ఈ స్థాయిలో ఒక్కసారిగా పెరగడం వల్ల వినియోగదారులు కొనుగోలు చేయడంలో వెనుకంజ వేస్తున్నారు. పెరుగుతున్న అంతర్జాతీయ మార్కెట్ ధోరణులే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.