Silver Rates: మళ్లీ భారీగా పెరిగిన వెండి.. ఈ రోజు ఎంత పెరిగిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సిల్వర్ ధర మళ్లీ షాకిచ్చింది. ఇటీవల 3 లక్షల మార్కును దాటిన వెండి ధర మరో రికార్డ్ దిశగా కొనసాగుతోంది. కనుమ రోజున తగ్గినట్టే ఈ రోజు మళ్లీ వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండి ధర ఈ రోజే రూ.3,000 పెరిగి బులియన్ మార్కెట్‌లో రూ.2,95,000 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.3,10,000 వద్ద ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో రూ.2,95,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, బంగారం ధరలలో కూడా పెరుగుదల నమోదైంది. తులం గోల్డ్ (24 క్యారెట్ల 10 గ్రాముల) ధర రూ.1,43,780 వద్ద ట్రేడ్ అవుతోంది,
Details
వివిధ నగరాల్లో ధరల మధ్య తేడా
ఇది రూ.380 పెరగడం పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,800 వద్ద ట్రేడ్ అవుతూ రూ.350 పెరిగింది 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,840 వద్ద ట్రేడ్ అవుతూ రూ.290 పెరుగుదల చూపింది. వివిధ నగరాల్లో ధరల మధ్య తేడాలు కూడా కనిపిస్తున్నాయి, అయితే వెండి, బంగారం ధరలు మళ్లీ పెరుగుదలతో బులియన్ మార్కెట్‌లో కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి.