
Gold Rates: బంగారం ధరల్లో స్వల్ప మార్పు.. నేడు తులం పసిడి ధర ఎంత?
ఈ వార్తాకథనం ఏంటి
ఈరోజు దేశంలోని ముఖ్య నగరాల్లో బంగారం ధరల్లో స్వల్పంగా పెరుగుదల చోటుచేసుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.100 పెరిగింది. తాజా పెరుగుదలతో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.9,060గా ఉంది. అదే 10 గ్రాములకు ధర రూ.90,600కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారానికి కూడా అదే స్థాయిలో ధర పెరిగింది. ప్రస్తుతం 1 గ్రాము ధర రూ.9,883గా ఉండగా, 10 గ్రాముల ధర రూ.98,830 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ హైదరాబాద్ ధరలే ఉన్నాయి.
Details
వెండి ధరల్లో మార్పులు
దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం స్వల్ప వ్యత్యాసం ఉంది. అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,980గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే, ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా బంగారంకొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,20,000గా ఉండగా, ఢిల్లీలో అదే కిలో వెండి రూ.1,10,000 వద్ద ట్రేడ్ అవుతోంది. మొత్తానికి, బంగారం ధరలో స్వల్ప పెరుగుదల నమోదుకాగా.. వెండి ధర మాత్రం మారకుండా కొనసాగుతోంది.