
Gold Silver Rates Today: బంగారం వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఇవాళ రేట్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం, వెండి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న వారికి ఓ శుభవార్త అందింది. ఎందుకంటే జూలై 21న (సోమవారం) స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గినట్టు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం చెబుతోంది. ఉదయం 6.30 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,030కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,690గా నమోదైంది. ఇవి నిన్నటి ధరలతో పోలిస్తే రూ.10 మేర తగ్గాయి. తగ్గుదల చాలా తక్కువే అయినప్పటికీ భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేసే వారికి ఇది ఊరటగా చెప్పవచ్చు. అయితే సామాన్యులు మాత్రం రూ. లక్ష దాటిన బంగారం రేట్లను చూసి కొనుగోలు చేయాలా? వద్దా? అని వెనకాడుతున్నారు.
Details
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (జూలై 21 ఉదయం 6.30 గంటలకు)
చెన్నై: 24 క్యారెట్లు-రూ. 1,00,030 | 22 క్యారెట్లు -రూ. 91,690 ముంబై: 24 క్యారెట్లు-రూ. 1,00,030 | 22 క్యారెట్లు -రూ. 91,690 ఢిల్లీ: 24 క్యారెట్లు-రూ. 1,00,180 | 22 క్యారెట్లు -రూ. 91,840 కోల్‌కతా: 24 క్యారెట్లు- రూ. 1,00,030 | 22 క్యారెట్లు -రూ. 91,690 బెంగళూరు: 24 క్యారెట్లు- రూ. 1,00,030 | 22 క్యారెట్లు - రూ. 91,690 హైదరాబాద్: 24 క్యారెట్లు- రూ. 1,00,030 | 22 క్యారెట్లు -రూ. 91,690 విజయవాడ: 24 క్యారెట్లు- రూ. 1,00,030 | 22 క్యారెట్లు - రూ. 91,690 విశాఖపట్నం: 24 క్యారెట్లు- రూ. 1,00,030 | 22 క్యారెట్లు -రూ. 91,690
Details
వెండి ధరల్లోనూ స్వల్ప తగ్గుదల
నిన్న కిలో వెండి ధర రూ. 1,16,000గా ఉండగా, ఈరోజు అది రూ. 1,15,900కి తగ్గింది. అంటే కిలో వెండి ధర రూ.100 మేర పడిపోయింది. ఈ స్వల్ప మార్పు కూడా వెండి కొనుగోలుదారులకు కొంత ఊరటను ఇచ్చే అంశమే. ఇది వరకూ జూలై 21న ఉదయం వరకూ నమోదైన ధరలు కావడంతో, రోజంతా మార్కెట్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకే కొనుగోలు చేయడానికి ముందు తాజా ధరలు పరిశీలించుకోవడం ఉత్తమం.