Gold Price Today: పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
'పసిడి ప్రియులకు' నేడు కొంత ఊరట లభించింది. ఇటీవల గోల్డ్ రేట్స్ భారీగా పెరిగి లక్షా 35 వేల వరకు చేరుకున్నాయి. ఆ తర్వాత వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరల్లో నిన్న మరోసారి పెరుగుదల నమోదు కావడంతో వినియోగదారులు ఆందోళన చెందినప్పటికీ, ఈరోజు మాత్రం ధరలు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్ తాజా వివరాల ప్రకారం 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.80 తగ్గి రూ.12,785కు చేరింది. 22 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.70 తగ్గి రూ.11,720 వద్ద ట్రేడ్ అవుతోంది.
Details
10 గ్రాముల ధరలు ధర ఎంతంటే
24 క్యారెట్లు: రూ.1,27,850 22 క్యారెట్లు: రూ.1,17,200 నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం రూ.800, 22 క్యారెట్ల పసిడి రూ.700 మేర తగ్గింది.
Details
హైదరాబాద్‌లో
24 క్యారెట్ల 10 గ్రాముల ధర: రూ.1,27,850 22 క్యారెట్ల 10 గ్రాముల ధర: రూ.1,17,200 ఇదే రేట్లు విశాఖ, విజయవాడల్లో కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం వరుసగా ఐదో రోజూ పెరుగుదలనే చూపిస్తున్నాయి. నిన్న కిలోపై రూ.11,000 పెరగగా, నేడు మరో రూ.100 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 1,73,100, కాగా హైదరాబాద్, విశాఖ, విజయవాడల్లో రూ.1,83,000గా ట్రేడ్ అవుతోంది. పసిడి ధరలు తగ్గడంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించినా, వెండి మాత్రం ఇప్పటికీ వేగంగా పెరుగుతూనే ఉంది.