Loading...
SoftBank AI Natural Gas Investment: ఏఐ డేటా సెంటర్లకు గ్యాస్ కష్టాలు.. సాఫ్ట్‌బ్యాంక్ నష్టమే కారణమా?
ఏఐ డేటా సెంటర్లకు గ్యాస్ కష్టాలు.. సాఫ్ట్‌బ్యాంక్ నష్టమే కారణమా?

SoftBank AI Natural Gas Investment: ఏఐ డేటా సెంటర్లకు గ్యాస్ కష్టాలు.. సాఫ్ట్‌బ్యాంక్ నష్టమే కారణమా?

వ్రాసిన వారు Balachander Sharma
Nov 13, 2026
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో డేటా సెంటర్లకు విద్యుత్ అవసరం భారీగా పెరిగింది. ఈ అవకాశాన్ని ముందుగానే గుర్తించిన జపాన్ పెట్టుబడుల సంస్థ సాఫ్ట్‌బ్యాంక్.. సహజ వాయువుతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులపై భారీగా దృష్టి పెట్టింది. 2025 ఫిబ్రవరిలో తన అనుబంధ సంస్థ ఎస్‌బీ ఎనర్జీ ద్వారా 9.2 గిగావాట్ల సామర్థ్యంతో గ్యాస్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 33 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ప్రణాళికలో భాగంగా అవసరానికి మించి టర్బైన్లను బుక్ చేయడం ఇప్పుడు సంస్థకు భారంగా మారింది.

Details

అవసరానికి మించి ఆర్డర్లు.. భారీ నష్టం

సుమారు రెండేళ్ల క్రితమే సాఫ్ట్‌బ్యాంక్ 13 గిగావాట్లకు పైగా సామర్థ్యం కలిగిన గ్యాస్ టర్బైన్ల కోసం ముందస్తు డిపాజిట్లు చెల్లించినట్లు సమాచారం.

వాస్తవ అవసరంతో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం ఎక్కువ. ఏఐ డేటా సెంటర్లకు విద్యుత్ కొరత రాకుండా ముందుగానే పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నది సంస్థ ఆలోచన.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మంగళవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో సాఫ్ట్‌బ్యాంక్ 7.1 బిలియన్ డాలర్ల నష్టాన్ని వెల్లడించింది.

ఇందులో సగానికి పైగా విద్యుత్ ఉత్పత్తి పరికరాలకు సంబంధించిన నష్టాలే ఉన్నాయి. తిరిగి పొందలేని ముందస్తు చెల్లింపుల్లో 3 బిలియన్ డాలర్లకు పైగా విలువ కోల్పోయినట్లు అంచనా.

Details

గ్యాస్ ఒక్కటే పరిష్కారం కాకపోవచ్చు

ఏఐ డేటా సెంటర్లకు విద్యుత్ అందించేందుకు గ్యాస్ ప్లాంట్లే ఉత్తమ మార్గమని భావించిన సంస్థలకు ఇప్పుడు కొత్త ఆలోచనలు వస్తున్నాయి.

చలికాలంలో గ్యాస్ సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడం వంటి సమస్యలు విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపవచ్చు.

అందుకే విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేసుకోవడంతో పాటు భారీ బ్యాటరీలను వినియోగించడం కూడా ఖర్చు తగ్గించే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

సాఫ్ట్‌బ్యాంక్ నష్టం వల్ల గ్యాస్ విద్యుత్ ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయని చెప్పలేం. ఏఐ అవసరాలు ఇంకా పెరుగుతున్నాయి.

అయితే విద్యుత్ కోసం గ్యాస్‌పై అతిగా ఆధారపడటం ఎంతవరకు లాభదాయకమనే ప్రశ్న మాత్రం ఇప్పుడు పెట్టుబడిదారుల ముందుంది.

ADVERTISEMENT