ఉద్యోగ కోతల లిస్ట్ లో చేరిన మరో సాఫ్ట్వేర్ దిగ్గజం SAP, 3,000 మంది తొలగింపు
జర్మన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం SAP కూడా ఉద్యోగులను తొలగించే టెక్ కంపెనీల లిస్ట్ లో చేరింది. సంస్థ 3,000 మందిని అంటే ప్రపంచవ్యాప్తంగా 2.5%మంది సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం సంస్థ పునర్నిర్మాణంలో భాగమని SAP తెలిపింది. 2022కి సంబంధించిన పూర్తి-సంవత్సర ఫలితాలను వెల్లడిస్తూ కంపెనీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం వలన 2024లో వార్షికంగా €300 మిలియన్ నుండి €350 మిలియన్ వరకు ఆదా అవుతుంది. 2018లో ఈ Qualtrics కంపెనీని $8 బిలియన్లకు SAP కొనుగోలు చేసిన వాటాలను అమ్మాలని ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఇందులో 71% వాటా ఉంది. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం రష్యా, బెలారస్‌లలో వ్యాపారాలను మూసివేయాలనే నిర్ణయం లాభాల తగ్గుదలకు కారణమని కంపెనీ పేర్కొంది.
ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం సంస్థ పునర్నిర్మాణంలో భాగమని SAP తెలిపింది
ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం సంస్థ పునర్నిర్మాణంలో భాగమని SAP తెలిపింది. ఈ నిర్ణయం వలన 2024లో వార్షికంగా €300 మిలియన్ నుండి €350 మిలియన్ వరకు ఆదా అవుతుంది. 2022 నాల్గవ త్రైమాసికంలో, SAP €8.44 బిలియన్ల ఆదాయాన్ని నమోదు చేసింది, అంతకు ముందు సంవత్సరంలో €7.98 బిలియన్లు. అయినప్పటికీ, నికర లాభం 47% క్షీణించి €1.2 బిలియన్లకు చేరుకుంది. SAP క్లౌడ్-ఆధారిత సబ్‌స్క్రిప్షన్ పై దృష్టి సారిస్తోంది. నాలుగో త్రైమాసికంలో క్లౌడ్ ఆదాయం 30% పెరిగి €3.39 బిలియన్లకు చేరుకుంది. సాఫ్ట్‌వేర్-లైసెన్సింగ్ వ్యాపారం మాత్రం దెబ్బతింది, ఆదాయం €1.46 బిలియన్ల నుండి €907 మిలియన్లకు పడిపోయింది. త్వరలో BMW పారిశ్రామిక క్లౌడ్ SAP ప్రీమియం క్లౌడ్ వ్యాపారంతో విలీనం కాబోతుంది.