ఉద్యోగ కోతలు మొదలుపెట్టిన మరో కంపెనీ, 3,900 ఉద్యోగులను తొలగించనున్న IBM
ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (IBM)కూడా ఉద్యోగులను తొలగించే టెక్ దిగ్గజాల జాబితాలో చేరింది. 3,900 మంది సిబ్బందిని అంటే ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో 1.5% మందిని తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ తొలగింపులు asset divestmentలో అంటే కొన్ని రంగాల్లో తమ వ్యాపారాన్ని నిలిపివేయడంలో భాగమని అంతేకాని పనితీరు అంచనాల ఆధారంగా కాదని సృష్టం చేసింది. మాంద్యం భయం కారణంగా వినియోగదారులు తమ ఖర్చులు తగ్గించుకోవడం ఇటువంటి టెక్ కంపెనీల ఆదాయానికి గండి పడింది. IBM తనకు తానుగా నిర్దేశించుకున్న వార్షిక లక్ష్యాన్ని 2022లో అందుకోలేకపోయింది. నిర్దేశించుకున్న $10 బిలియన్ల లక్ష్యం కంటే తక్కువగా అంటే $9.3 బిలియన్ల వార్షిక నగదు లావాదేవీలు జరిగాయి. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలే ఇందుకు కారణం
ఉద్యోగులను తొలగించే నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత, షేర్లు 2% పడిపోయాయి
గత త్రైమాసికంలో, IBM $16.69 బిలియన్ల ఆదాయాన్ని నమోదు చేసింది ఇది విశ్లేషకుల అంచనా వేసిన $16.40 బిలియన్ల కంటే ఎక్కువ. కంపెనీ ఆదాయం 2022లో 5.5% పెరిగింది, ఇది ఒక దశాబ్దం కాలంలో అత్యధిక ఆదాయం. ఇందులో $2.71 బిలియన్ల నికర ఆదాయాన్ని నమోదు చేసింది, అంతకు ముందు $2.33 బిలియన్లతో పోలిస్తే సాఫ్ట్‌వేర్, క్లౌడ్‌తో సహా సంస్థలోని అనేక విభాగాల ఆదాయం పెరిగింది. కంపెనీ ఉద్యోగులను తొలగించే నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత, షేర్లు 2% పడిపోయాయి. ప్రకటించిన ఉద్యోగ కోతల మార్కెట్ నిరుత్సాహానికి కారణమయిందని, సిబ్బందిలో ఇది 1.5% మాత్రమేనని ఆ సంస్థ తెలిపింది. ఖర్చులు భారీగా తగ్గడం వలన తొలగింపులను సంస్థలు బీమా పాలసీగా చూడటం ప్రారంభించాయి