LOADING...
New GST Rates:సెప్టెంబర్ 22 నుంచి మారే జీఎస్టీ రేట్లు: మీ జేబుకు తిప్పలు తెచ్చే ప్రధాన మార్పులు!
సెప్టెంబర్ 22 నుంచి మారే జీఎస్టీ రేట్లు: మీ జేబుకు తిప్పలు తెచ్చే ప్రధాన మార్పులు!

New GST Rates:సెప్టెంబర్ 22 నుంచి మారే జీఎస్టీ రేట్లు: మీ జేబుకు తిప్పలు తెచ్చే ప్రధాన మార్పులు!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం దేశంలో జీఎస్టీ వ్యవస్థలో భారీ మార్పులు జరగబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం GST 2.0 పేరుతో కొత్త పన్ను నిర్మాణాన్ని ప్రకటించింది. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయి. ఇప్పటివరకు పన్నులు 5-6 స్లాబులుగా వసూలు చేస్తున్నప్పటికీ, ఇకపై కేవలం మూడు శ్లాబ్‌లు మాత్రమే ఉంటాయి. అవి 5%, 18%, 40%. ఈ కొత్త పన్ను నిర్మాణంతో చాలానే ఉత్పత్తులు చౌకగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆరోగ్యానికి హానికరమైనవి, లగ్జరీ వస్తువులు, ప్రత్యేక వర్గానికి చెందిన ఉత్పత్తులపై పన్ను భారీగా పెరుగుతుంది.

వివరాలు 

ఖరీదైనవిగా మారే వస్తువులు: 

40% GST రేటులో చేరిన ముఖ్యమైన ఉత్పత్తులు: పానీయాలు: కోలా,ఎనర్జీ డ్రింక్స్, ఫ్లేవర్డ్ వాటర్ మొదలైనవి ఇప్పటివరకు 28%పన్ను కింద ఉండేవి. కానీ కొత్త రేట్లు ప్రకారం ఇవి ఇప్పుడు 40%పన్ను కిందకి వస్తాయి.దీని వలన వినియోగదారులకు అదనపు భారంగా ఉంటుంది. పొగాకు ఉత్పత్తులు: పాన్ మసాలా, నమలే పొగాకు, సిగరెట్లు, సిగార్లు ఇతర పొగాకు వస్తువుల పన్ను 28% నుండి 40%కి పెరిగింది. ఇది ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. లగ్జరీ వాహనాలు: 350 సీసీకి పైగా ఉన్న మోటార్ సైకిళ్లు,SUVలు, ఖరీదైన కార్లు ఇప్పుడు 40%GST కిందకి వస్తాయి.ప్రైవేట్ జెట్‌లు,హెలికాప్టర్లు,యాచ్ట్లు, లగ్జరీ పడవలు వంటి విలాసవంతమైన రవాణా సాధనాలపై కూడా పన్ను భారీగా పెరుగుతోంది.

వివరాలు 

5శాతం నుంచి 18శాతానికి పెరిగిన వస్తువులు: 

తుపాకులు, రివాల్వర్లు, పిస్టల్స్ వంటి వస్తువుల పన్ను కూడా 40%కి పెరిగిన సంగతి ప్రత్యేకం. కొన్ని ఇంధన పదార్థాలు - బొగ్గు, లిగ్నైట్, పీట్ వంటి ఉత్పత్తులు ఇప్పటివరకు 5% పన్ను కింద ఉండేవి. కానీ ఇప్పుడు ఇవి 18% GST కిందకి వస్తాయి. మెంథాల్ ఉత్పత్తులు (పిప్పర్మింట్ ఆయిల్, స్పియర్‌మింట్ ఆయిల్) బయోడీజిల్ కూడా కొత్తగా 18% GSTలోకి చేర్చబడ్డాయి. పరిశ్రమల ఖర్చు పెరగనుంది.

వివరాలు 

ప్రజలపై ప్రభావం: 

ఈ కొత్త జీఎస్టీ రేట్లు ప్రతి వర్గ ప్రజలపై వేర్వేరు ప్రభావాలను చూపనుండగా: సాధారణ ప్రజలు రోజువారీ ఉపయోగించే ఉత్పత్తులు - జీడిపప్పు, చక్కెర, కూరగాయలు లాంటి వస్తువులు చౌకగా మారే అవకాశం ఉంది. అయితే, లగ్జరీ వాహనాలు, పానీయాలు, పొగాకు ఉత్పత్తులు వంటి విలాసవంతమైన లేదా ఆరోగ్యానికి హానికరమైన వస్తువులను వినియోగించేవారికి భారీగా ఖర్చు పెరుగుతుంది. మధ్యతరగతి,ఉన్నత తరగతి వినియోగదారులు ప్రత్యేకంగా ఈ మార్పుల వల్ల ప్రభావితమవుతారు.

వివరాలు 

ప్రభుత్వ లక్ష్యాలు: 

ఈ కొత్త GST రేట్ల అమలుకు ప్రభుత్వ ఉద్దేశాలు రెండు ముఖ్య కారణాలు: సులభతరం చేయడం: ఇప్పటివరకు ఉన్న అనేక స్లాబుల స్థానంలో కేవలం మూడు స్లాబులు ఉండటం వల్ల పన్ను వ్యవస్థ మరింత సరళతరం అవుతుంది. 2. ఆరోగ్యకరమైన అలవాట్ల ప్రోత్సాహం: ఆరోగ్యానికి హానికరమైన, విలాసవంతమైన ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడం. అధిక పన్నుతో ప్రజల చేత అందుబాటులో ఉండకుండా చేయడం ద్వారా ఆరోగ్యకరమైన, సమతుల్యమైన వినియోగాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వం ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకుంది.