Page Loader
Passport: పాస్‌పోర్ట్‌కు రెన్యువల్ ప్రాసెస్‌ ఏంటి? ఛార్జీలు ఎంతో అవుతాయో తెలుసా?
పాస్‌పోర్ట్‌కు రెన్యువల్ ప్రాసెస్‌ ఏంటి? ఛార్జీలు ఎంతో అవుతాయో తెలుసా?

Passport: పాస్‌పోర్ట్‌కు రెన్యువల్ ప్రాసెస్‌ ఏంటి? ఛార్జీలు ఎంతో అవుతాయో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2024
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

వివిధ అవసరాలకు, ముఖ్యంగా ఉన్నత విద్య, ట్రావెలింగ్‌, బిజినెస్ వంటి కారణాల కోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ప్రయాణాలకు పాస్‌ పోర్ట్ తప్పనిసరి డాక్యుమెంట్, ఇది మన పౌరసత్వాన్ని ధృవీకరిస్తుంది. దేశం విడిచి వెళ్లాలన్నా, విదేశాల్లో ఉండాలన్నా పాస్‌పోర్ట్ అవసరం. ఇది లేకుండా అంతర్జాతీయ ప్రయాణం సాధ్యం కాదు. అయితే, పాస్‌పోర్ట్‌కు ఒక నిర్దిష్ట చెల్లుబాటు గడువు ఉంటుంది, ఇది ముగిసేలోపు రెన్యువల్ చేయాలి. చెల్లుబాటు ముగిసిన పాస్‌పోర్ట్‌తో ప్రయాణిస్తే అనవసరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

వివరాలు 

పాస్‌పోర్ట్‌ చెల్లుబాటు కాలం 

మన దేశంలో పాస్‌పోర్ట్ జారీ తేదీ నుంచి 10 ఏళ్లపాటు చెల్లుబాటు ఉంటుంది. అయితే, 18 ఏళ్లలోపు వ్యక్తులకు జారీ చేసే పాస్‌పోర్ట్ 5 సంవత్సరాల చెల్లుబాటు కలిగి ఉంటుంది. గడువు ముగిసే 9 నెలల ముందు పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ ప్రాసెస్‌ ప్రారంభించడం మంచిది.

వివరాలు 

రెన్యువల్ చేయడం ఎలా? 

పాస్‌పోర్ట్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ (https://www.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink) ఓపెన్ చేయండి. ఎగ్జిస్టింగ్‌ యూజర్‌ అయితే లాగిన్‌ అవ్వండి లేదా న్యూ యూజర్‌గా రిజిస్టర్‌ చేసుకోండి. 'అప్లై ఫర్‌ ఫ్రెష్‌ పాస్‌పోర్ట్/పాస్‌పోర్ట్ రీ-ఇష్యూ' ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. 'క్లిక్‌ హియర్‌ టూ ఫిల్‌ అప్లికేషన్‌ ఫార్మ్‌' సిలెక్ట్ చేసి, అప్లికేషన్ ఫార్మ్‌ను నింపి సబ్మిట్ చేయండి. అవసరమైన మొత్తం వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేయండి. రెన్యువల్ ఫీజు చెల్లించి అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయండి.

వివరాలు 

అపాయింట్‌మెంట్ ఎలా షెడ్యూల్‌ చేయాలి? 

పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి. 'వ్యూ సేవ్డ్‌ అండ్‌ సబ్మిటెడ్‌ అప్లికేషన్‌'పై క్లిక్‌ చేసి, పేమెంట్ పూర్తి చేసి, మీకు సరైన PSK ఎంపిక చేసుకోండి. అందుబాటులో ఉన్న తేదీల్లో మీకు అనువైన స్లాట్‌ను ఎంచుకుని అపాయింట్‌మెంట్ బుక్ చేయండి. పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం.. అవసరమైన డాక్యుమెంట్లు ప్రస్తుత పాస్‌పోర్ట్, మొదటి, చివరి పేజీల ఫోటోకాపీలు. మీ ప్రస్తుత అడ్రస్‌ని నిరూపించే ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్, పాస్‌పోర్ట్‌లో ఎక్స్‌టెండెడ్‌ వ్యాలిడిటీని సూచించే పేజీలు ఉంటే, వాటి ఫొటోకాపీ.

వివరాలు 

పాస్‌పోర్ట్ రెన్యువల్ ఫీజులు

స్టాండర్డ్ పాస్‌పోర్ట్ (36 పేజీలు): 10 సంవత్సరాలు చెల్లుబాటు. ఫీజు: రూ.1,500 జంబో పాస్‌పోర్ట్ (60 పేజీలు): 10 సంవత్సరాలు చెల్లుబాటు. ఫీజు: రూ.2,000 తక్షణం అవసరం అయితే: అదనంగా రూ.2,000 చెల్లించాలి.