LOADING...
ఆధార్‌ని పాన్ నంబర్‌తో లింక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇవి పాటించండి
లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2022తో ముగిసింది

ఆధార్‌ని పాన్ నంబర్‌తో లింక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇవి పాటించండి

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 16, 2023
06:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది మార్చి 31లోపు పాన్‌ నంబర్లకు ఆధార్‌ను లింక్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2022తో ముగిసింది, కానీ ప్రభుత్వం దానిని రూ.1000 అపరాధ రుసుముతో పొడిగించింది. ఇప్పటికే పాన్‌తో ఆధార్‌ని లింక్ చేసినప్పటికీ, అది పూర్తయిందో లేదో ఖచ్చితంగా తెలియకపోతే, లింక్ 'స్టేటస్'ని చెక్ చేయడానికి ఒక మార్గం ఉంది. SMS ద్వారా పాన్-ఆధార్ లింక్ స్టేటస్ ను చెక్ చేయడానికి మొదట కొత్త SMS సందేశాన్ని సృష్టించి అందులో ఈ విధంగా UIDPAN < 12 అంకెల ఆధార్ నంబర్> < 10 అంకెల పాన్‌ నెంబర్> టైప్ చేసి 567678 లేదా 56161కి SMS పంపాలి.

పాన్

వెబ్ పోర్టల్ ఉపయోగించి కూడా పాన్-ఆధార్ లింకింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు

పాన్ ఆధార్‌కి లింక్ అయితే, "ఆధార్ ఇప్పటికే ITD డేటాబేస్‌లోని పాన్ కి లింక్ చేయబడింది. మా సేవలను ఉపయోగించినందుకు ధన్యవాదాలు" అని మెసేజ్ వస్తుంది. కాకపోతే తో లింక్ కాలేదని వస్తుంది. వెబ్ పోర్టల్ ఉపయోగించి పాన్-ఆధార్ లింకింగ్ స్టేటస్ కోసం UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లండి (https://uidai.gov.in/). "Adhaar Services" లో "Adhaar link status"ని ఎంచుకోండి. ఇప్పుడు, 12-అంకెల ఆధార్ టైప్ చేసి "Get Status" బటన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్ నంబర్‌తో పాటు క్యాప్చా కోడ్‌ ఇవ్వాలి. మీ ఆధార్-పాన్ లింక్ గురించి చూడటానికి "Get Linking Status"ని క్లిక్ చేయండి. అప్పుడు లింక్ అయిందా, లేదా అనేది తెలుస్తుంది.