Page Loader
Stock Market: సేఫ్.. కోలుకున్న మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు జంప్‌
Stock Market:సేఫ్.. కోలుకున్న మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు జంప్‌

Stock Market: సేఫ్.. కోలుకున్న మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు జంప్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ట్రంప్ టారిఫ్ ప్రభావంతో గత సెషన్‌లో పతనమైన స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, ఆర్థిక అస్థిరతలు కొనసాగుతున్నప్పటికీ, ప్రముఖ రంగాల్లోని షేర్లపై కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ 1100 పాయింట్లకుపైగా లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించగా, నిఫ్టీ మళ్లీ 22,500 స్థాయిని అధిగమించింది. ప్రస్తుతం ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 1180.73 పాయింట్లు పెరిగి 74,318.63 వద్ద, నిఫ్టీ 361 పాయింట్ల లాభంతో 22,522.60 వద్ద ట్రేడవుతున్నాయి.

వివరాలు 

ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా తిరిగి బలపడ్డాయి

జపాన్‌లో నిక్కీ సూచీ 6.41 శాతానికి పైగా పెరిగింది. అదే విధంగా, ఆస్ట్రేలియా ASX సూచీ 0.18 శాతం, దక్షిణ కొరియాలో కోస్పి 1.7 శాతం, హాంకాంగ్‌లో హాంగ్‌సెంగ్ సూచీ 2.2 శాతం మేర లాభాల్లో ఉన్నాయి. అటు అమెరికా మార్కెట్లు సోమవారం నాడు మిశ్రమంగా ముగిశాయి. డోజోన్స్ 0.91 శాతం, ఎస్ అండ్ పీ సూచీ 0.23 శాతం నష్టపోయాయి. అయితే నాస్‌డాక్ మాత్రం 0.10 శాతం లాభంతో నిలిచింది. ప్రస్తుతం అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ లాభాలలో ఉన్నాయి. దీనిని బట్టి మంగళవారం యూఎస్ మార్కెట్లు కూడా లాభాల దిశగా సాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.