LOADING...
Stock Market: మార్కెట్‌ను వదలని ట్రంప్ భయం.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

Stock Market: మార్కెట్‌ను వదలని ట్రంప్ భయం.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్‌పై ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధ భయం ప్రభావం చూపిస్తోంది. గత వారం మార్కెట్ సూచీలు తీవ్రంగా నష్టపోయాయి, దీంతో లక్షల కోట్ల రూపాయల సంపద హరించుకుపోయింది. ఈ వారం మార్కెట్ స్థిరపడుతుందని భావించినా, అదే భయాందోళన కొనసాగింది. దీని ప్రభావంతో, సోమవారం ఉదయం మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమై, చివరి వరకు నెగెటివ్ ట్రెండ్‌లోనే కొనసాగాయి. చివరికి, సెన్సెక్స్ 856 పాయింట్ల నష్టంతో 74,454 వద్ద ముగియగా, నిఫ్టీ 242 పాయింట్లు కోల్పోయి 22,553 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 86.70 వద్ద స్థిరంగా ముగిసింది.

వివరాలు 

1 శాతం మేర నష్టపోయిన బిఎస్‌ఇ మిడ్‌క్యాప్,స్మాల్‌క్యాప్ సూచీలు

నిఫ్టీలో విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా స్టీల్ అత్యధికంగా నష్టపోగా, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాలను సాధించాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్,స్మాల్‌క్యాప్ సూచీలు తలా 1 శాతం మేర నష్టపోయాయి.