Page Loader
Stock Market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో.. నిఫ్టీ 22,900 వద్ద ట్రేడింగ్
స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో.. నిఫ్టీ 22,900 వద్ద ట్రేడింగ్

Stock Market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో.. నిఫ్టీ 22,900 వద్ద ట్రేడింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నా, ప్రధాన షేర్లలో కొనుగోలుకు మదుపర్లు ఆసక్తి చూపడంతో సూచీలు మంచి ప్రదర్శనను ఇచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు సూచీలకు సానుకూలంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో సూచీలు ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 250 పాయింట్లు పెరిగి ట్రేడింగ్‌ను ప్రారంభించగా, నిఫ్టీ 22,950 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్‌ 310 పాయింట్ల లాభంతో 75,676 వద్ద ట్రేడవుతోంది, నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 22,899 వద్ద ఉంది.

Details

లాభాల్లో జొమాటో షేర్లు

సెన్సెక్స్‌ 30 సూచీలో, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జొమాటో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీ సుజుకీ, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల కింద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో, బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ ధర 73.14 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 2,742.90 డాలర్ల వద్ద కదలాడుతోంది.

Details

మిశ్రమంగా ట్రేడవుతున్న అసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు

అమెరికాలో వాణిజ్య విధానంపై అనిశ్చితి కారణంగా సోమవారం అక్కడి మార్కెట్లు భారీగా పడిపోయాయి. ఎస్‌అండ్‌పీ 500 1.46 శాతం, నాస్‌డాక్‌ 3.07 శాతం క్షీణించాయి. ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు ఈ రోజు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గత ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.5,015 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.6,642 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.