తదుపరి వార్తా కథనం

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 16, 2025
04:13 pm
ఈ వార్తాకథనం ఏంటి
మంగళవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై, తరువాత ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ సూచిక మొత్తం 594.95 పాయింట్లు లేదా 0.73 శాతం పెరిగి 82,380.69 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచిక కూడా 169.90 పాయింట్లు లేదా 0.68 శాతం లాభంతో 25,239.10 స్థాయికి చేరింది. ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో కొఠారి ప్రొడక్షన్, రవీందర్ హైట్స్, రెడింగ్టన్, లక్ష్మీ డెంటల్, పావ్నా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు ముందుండగా, శ్రద్ధ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, జేఐటీఎఫ్ ఇన్‌ఫ్రాలాజిస్టిక్స్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ, మాగ్నమ్ వెంచర్స్, థెమిస్ మెడికేర్ సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.