LOADING...
Stock Market: లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,987
లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,987

Stock Market: లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,987

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2025
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభదాయకంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన సానుకూల సంకేతాల కారణంగా.. మన సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. ముఖ్యంగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత అంచనాలు ఉపకరిస్తున్నాయి. దీంతో నిఫ్టీ 25,000 పాయింట్ల దాకా చేరువైన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 9:33 నాటికి సెన్సెక్స్ 381 పాయింట్లు పెరిగి 81,489 పాయింట్ల వద్ద ఉందిగా, నిఫ్టీ కూడా 118 పాయింట్లు ఎగబాకి 24,987 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ సమయంలో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 88.13కి చేరింది.

వివరాలు 

ఏ షేర్లు ఎలా..? 

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, జియో ఫైనాన్షియల్‌, టెక్ మహీంద్రా, లార్సెన్ & టూబ్రో షేర్లు లాభదాయకంగా ట్రేడవుతున్నాయి. అయితే, హీరో మోటార్కార్ప్‌, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, టైటాన్ కంపెనీ, హిందాల్కో షేర్లు నష్టపోతున్నాయి. మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసిన తరువాత, ఈరోజు ఆసియా మార్కెట్లు కూడా అదే దిశలో పయనిస్తున్నాయి. ఇదిలావుంటే వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్వరంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా అధికారులు ఇండియాతో వివిధ అడ్డంకులను తొలగించేందుకు చర్చలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం, చైనాపై 100 శాతం కస్టమ్‌ డ్యూటీ విధించాలని ఐరోపా దేశాలకు సూచించారు. ఈ పరిణామాలను మదుపర్లు నిశ్శబ్దంగా గమనిస్తూ మార్కెట్ మార్పులపై దృష్టిపెడుతున్నారు.