
Stock Market Today: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో వరుస నష్టాల బాట పట్టిన దేశీయ షేర్ మార్కెట్ సూచీలు నేటి ట్రేడింగ్‌లో ఊగిసలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య షేర్లు సుతారంగా, ఫ్లాట్‌గా కదలడుతున్నాయి. ఉదయం 9.39 గంటల సమయంలో సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 80,148 వద్ద స్థిరపడింది. అదే సమయంలో నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 24,519 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో కొన్ని షేర్లు లాభాలను నమోదు చేస్తున్నాయి. హెచ్‌యూఎల్, ఆసియన్ పెయింట్స్, ట్రెంట్, కొటక్ మహీంద్రా, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ వంటి కంపెనీ షేర్లు లాభప్రదంగా కదలాడుతున్నాయి. అయితే ఎన్‌టీపీసీ, టైటాన్ కంపెనీ, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
వివరాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.69 నమోదు
ప్రస్తుత ట్రేడింగ్ సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.69 వద్ద ఉంది. గురువారం సాయంత్రం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిసిన నేపథ్యంలో, నేటి ట్రేడింగ్‌లో జపాన్ నిక్కీ మినహా మిగతా ఆసియా మార్కెట్లు కూడా సానుకూల ధోరణిలో కదలుతున్నారు. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వార్షిక సాధారణ సమావేశం (AGM) నేపథ్యంలో షేర్లలో బలమైన కదలికలను చూపిస్తోంది. 48వ ఏజీఎం శుక్రవారం (ఆగస్టు 29) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.