Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు లాభాల్లో కదులుతున్నాయి.
ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ (Sensex) 475 పాయింట్లు పెరిగి 74,309 వద్దకు చేరుకోగా, నిఫ్టీ (Nifty) 154 పాయింట్లు లాభపడి 22,551 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.80 వద్ద స్థిరంగా ఉంది.
వివరాలు
మార్కెట్లలో సానుకూల ప్రభావం
నిఫ్టీ సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.
బీపీసీఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, బ్రిటానియా, హీరో మోటోకార్ప్ స్టాక్స్ మాత్రం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
అమెరికా మార్కెట్లు గత శుక్రవారం ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి, దీనికి అనుగుణంగా మన మార్కెట్లలో సానుకూల ప్రభావం కనిపిస్తోంది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన నేపథ్యంలో, ఆ బ్యాంక్ షేర్లు లాభాలతో కొనసాగుతున్నాయి.