
Stock Market: ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్.. నిఫ్టీ @ 24,982
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన దేశ సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ప్రత్యేకంగా, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాల వేళ మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 91 పాయింట్ల లాభంతో 81,491 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 9.3 పాయింట్ల లాభంతో 24,982 వద్ద కదలుతోంది. డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి మారకం విలువు 88.13 వద్ద నిలిచింది.
వివరాలు
ఏ షేర్లు ఎలా..?
నిఫ్టీ సూచిలో ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, జియో ఫైనాన్షియల్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభకరంగా ట్రేడవుతుండగా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హీరో మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, ట్రెంట్ స్టాక్స్ నష్టపోతూ ఉన్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిసిన పరిస్థితిలో, ఈరోజు ఆసియా మార్కెట్లు కూడా అదే దిశగా ట్రేడవుతున్నాయి.