Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 22,600 మార్క్ దాటిన నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, కనిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు సూచీలకు (Stock Market) మద్దతుగా నిలుస్తున్నాయి.
ఈ ప్రభావంతో సోమవారం ట్రేడింగ్‌లో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ (Sensex) 200 పాయింట్లకు పైగా పెరిగి, నిఫ్టీ (Nifty) 22,600 మార్క్‌ను దాటింది.
ఉదయం 9.30 గంటల సమయానికి, సెన్సెక్స్ 227 పాయింట్లు పెరిగి 74,560 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 22,625 వద్ద కొనసాగుతోంది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసలు పడిపోయి 87.29గా నమోదైంది.
వివరాలు
లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు
నిఫ్టీలో సన్‌ఫార్మా, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభపడుతుండగా, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, బజాజ్ ఆటో, ఐటీసీ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఆసియా పసిఫిక్ మార్కెట్లు సోమవారం మిశ్రమంగా కదలాడుతున్నాయి.
జపాన్ నిక్కీ 0.57 శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.47 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ సూచీ 0.2 శాతం మేర లాభాల్లో ఉంటే, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 1.69 శాతం నష్టాల్లో ట్రేడవుతోంది.
మరోవైపు, అమెరికా మార్కెట్లు గత శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 0.55 శాతం, నాస్‌డాక్ 0.7 శాతం, డోజోన్స్ 0.52 శాతం పెరిగాయి.