Stock Market: భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు ఈ నష్టాల కారణమయ్యాయి.
ఎన్డీయే కూటమి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రభావం సూచీలపై కన్పించింది.
ఉదయం 9.30 గంటల సమయానికి, సెన్సెక్స్ 450 పాయింట్లు కోల్పోయి 77,062 వద్ద, నిఫ్టీ 153 పాయింట్ల నష్టంతో 23,328 వద్ద కొనసాగాయి.
ప్రారంభంలో సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా డౌన్ అయింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.16 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ సూచీలో మారుతీ సుజుకీ, ఐషర్ మోటార్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, నెస్లే సంస్థల షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.
Details
నష్టాల్లో టాటా స్టీల్, బీపీసీఎల్
హిందాల్కో, లార్సెన్, బీపీసీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా స్టీల్ సంస్థలు నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
బడ్జెట్‌లో ఆదాయపు పన్ను ఉపశమనం కారణంగా వినియోగ ఆధారిత రంగాల షేర్లు సానుకూలంగా కదలాడుతున్నాయి.
అదే సమయంలో వ్యవసాయ అనుసంధాన షేర్లు కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఈనెల 5-7 తేదీలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్వహించే ద్రవ్యపరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) నిర్ణయాలు శుక్రవారం వెలువడతాయి.
ఈ సమయంలో వడ్డీరేట్లను 0.25% తగ్గించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.