Page Loader
Stock market: స్టాక్ మార్కెట్ ఊగిసలాట.. వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగింపు
స్టాక్ మార్కెట్ ఊగిసలాట.. వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగింపు

Stock market: స్టాక్ మార్కెట్ ఊగిసలాట.. వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడమే కాకుండా, కనిష్ఠ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించడం కారణంగా ఉదయం మార్కెట్ మెల్లగా మెరుగవ్వడం కనిపించింది. అయితే వరుస నష్టాల తర్వాత మార్కెట్ ఊరట పొందినట్టే అనిపించినా, అదే రోజు ఎఫ్‌అండ్‌ఓ వీక్లీ ఎక్స్‌పైరీ ఉండటం, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాల ప్రభావం కారణంగా సూచీలు మళ్లీ వెనక్కి మళ్లాయి.

Details

నష్టాల్లో సూచీలు

ఫలితంగా వరుసగా ఏడో రోజూ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం స్వల్ప లాభాలతో 76,201.10 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 76,171.08) ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతుతో దాదాపు 600 పాయింట్ల లాభంతో 76,764.53 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. అయితే చివర్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో, చివరికి 32.11 పాయింట్ల నష్టంతో 76,138.97 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 13.85 పాయింట్ల నష్టంతో 23,031.40 వద్ద ముగిసింది.

Details

 రూపాయి, అంతర్జాతీయ మార్కెట్లు 

నష్టపోయిన స్టాక్స్ అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ లాభపడిన స్టాక్స్ టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, జొమాటో మార్కెట్ నష్టాల్లో కొనసాగుతుండడంతో, మదుపరులు మదుపు నిర్ణయాలు తీసుకునే ముందు అంతర్జాతీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.