
Stock Market : లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,946
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. జీఎస్టీ సంస్కరణలపై ఉన్న ఆశాభావాలు, సానుకూల సెంటిమెంట్ మార్కెట్‌ను ప్రేరేపిస్తున్నాయి. అదనంగా, మన దేశ రేటింగ్‌ను 'BBB-' నుండి 'BBB'గా ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సవరించడం పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ధోరణులు కూడా నేటి ట్రేడింగ్‌కు ప్రోత్సాహాన్ని కల్పించాయి.
వివరాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.39గా నమోదు
ఉదయం 9:32 గంటలకు సెన్సెక్స్ 266 పాయింట్లు పెరిగి 81,566 వద్ద నిలిచింది. నిఫ్టీ 76.85 పాయింట్లు ఎగబాకి 24,946 వద్ద కదలుతోంది. నిఫ్టీ సూచీలో టీసీఎస్, టెక్ మహీంద్రా, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మరోవైపు జియో ఫైనాన్షియల్, అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్‌లు నష్టంలో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.39 వద్ద ఉంది.