
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్ దాటిన నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.
కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు,అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సంకేతాల ప్రభావంతో ఈ వారం పాజిటివ్ నోటుతో మొదలైంది.
నిఫ్టీ సూచీ 25,000 మార్కును అధిగమించింది. నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్ లాభాలదిశగా కొనసాగింది,ఇది మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉంది.
ఉదయం 9:29 గంటలకు సెన్సెక్స్ 639 పాయింట్లు పెరిగి 82,360 వద్ద ట్రేడవుతున్నది. అదే సమయంలో నిఫ్టీ 195 పాయింట్ల లాభంతో 25,048 వద్ద కొనసాగింది.
రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 44 పైసలు పెరిగి 85.01 వద్ద ఉంది. నిఫ్టీలోని ప్రధాన షేర్లలో ఎంఅండ్‌ఎం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో,టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ లాభాలతో కదలాడుతున్నాయి.
వివరాలు
ద్విచక్ర వాహనాలు,ట్రాక్టర్ల తయారీ కంపెనీలపై మదుపర్ల దృష్టి
అయితే ఎటర్నల్ మరియు సిప్లా షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమ ధోరణి కనబర్చగా,శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
ఇదిలా ఉండగా,యూరోపియన్ యూనియన్(ఈయూ)దేశాలపై సుంకాల అంశంలో ట్రంప్ వెనక్కి తగ్గారు.
వాణిజ్య చర్చల గడువును జులై 9 వరకు పొడిగించారు.గతంలో ట్రంప్ ఈయూ దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని,జూన్ 1 నుండి కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక రుతుపవనాల ప్రభావంతో ద్విచక్ర వాహనాలు,ట్రాక్టర్ల తయారీ కంపెనీలపై మదుపర్ల దృష్టి ఎక్కువగా ఉండనుంది.
ఇప్పటికే అరబిందో ఫార్మా,సుందరం ఫైనాన్స్,బేయర్ క్రాప్‌సైన్స్,ఒలెక్ట్రా గ్రీన్‌టెక్,నజారా టెక్నాలజీస్,శిల్పా మెడికేర్,జీఐసీ,పవర్‌గ్రిడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ బోర్డు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మదుపర్లు ఈ కంపెనీలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.