Loading...
Stock Market: నేడు కూడా భారీ పతనం దిశగా మార్కెట్‌ సూచీలు.. 600 పాయింట్లకు పైగా నష్టం
నేడు కూడా భారీ పతనం దిశగా మార్కెట్‌ సూచీలు.. 600 పాయింట్లకు పైగా నష్టం

Stock Market: నేడు కూడా భారీ పతనం దిశగా మార్కెట్‌ సూచీలు.. 600 పాయింట్లకు పైగా నష్టం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2026
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు సరఫరాపై నెలకొన్న ఆందోళనలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సోమవారం భారీగా పతనమైన సూచీలు.. మంగళవారం కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెప్టెంబరు 29 ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 614.27 పాయింట్లు నష్టపోయి 72,157.45 వద్ద, నిఫ్టీ 181.20 పాయింట్లు క్షీణించి 22,599.05 వద్ద ట్రేడయ్యాయి. చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ పెరుగుదల వంటి అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. సోమవారం కూడా దేశీయ సూచీలు దాదాపు 1.6 శాతం నష్టపోయి ఆరు నెలల కనిష్ఠ స్థాయులకు చేరాయి.

వివరాలు 

కారణాలు ఇవే..

చమురు ధరల భారం:

పశ్చిమాసియా పరిణామాల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు సుమారు 107 డాలర్లకు చేరింది.

చమురు సరఫరాకు సంబంధించి అనిశ్చితి కొనసాగుతుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశాలపై ఆందోళనలు నెలకొన్నాయి.

భారత్‌ తన అవసరాల్లో అధిక భాగం ముడిచమురును దిగుమతి చేసుకోవడంతో ధరల పెరుగుదల దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

ఎఫ్‌ఐఐల భారీ విక్రయాలు

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) భారత ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలను పెంచారు. సెప్టెంబరు 28న ఒక్కరోజే రూ.5,353.22 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

ఇదే సెప్టెంబరులో ఇప్పటివరకు ఒక రోజులో నమోదైన అత్యధిక ఎఫ్‌ఐఐ నికర అమ్మకాలుగా నిలిచింది.

వివరాలు 

ట్రెజరీ ఈల్డ్స్‌ పెరుగుదల

అదే సమయంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DII) రూ.5,189.02 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

అమెరికా ఫెడ్‌ మరిన్ని వడ్డీ రేట్ల పెంపులకు వెళ్లొచ్చన్న అంచనాలు బాండ్‌ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్‌ 5.2 శాతానికి పైగా పెరిగింది. పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణ ఆందోళనలను పెంచుతుండటంతో.. భవిష్యత్తులో వడ్డీ రేట్లపై ఫెడ్‌ కఠిన వైఖరి అవలంబించవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి.

ఇది ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

ఆసియా మార్కెట్లలోనూ నష్టాలు

దేశీయ మార్కెట్లతో పాటు ఆసియా స్టాక్‌ మార్కెట్లలోనూ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

చమురు ధరలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ పెరుగుదల ప్రభావంతో జపాన్‌, దక్షిణ కొరియా తదితర మార్కెట్లు నష్టాల్లో కదిలాయి.

అంతకుముందు సోమవారం అమెరికా మార్కెట్లు కూడా నష్టాలతో ముగిశాయి. డౌ జోన్స్‌ 0.7 శాతం, ఎస్‌అండ్‌పీ 500 0.8శాతం,నాస్‌డాక్‌ 0.9శాతం చొప్పున క్షీణించాయి.

అమెరికా-ఇరాన్‌ పరిణామాల ప్రభావం

అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతుండటం కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.

హర్ముజ్‌ జలసంధి ద్వారా చమురు రవాణాపై ఆందోళనలు పెరగడంతో సోమవారం క్రూడ్‌ ధరలు ఒక్కసారిగా ఎగిశాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ ప్రతిపాదనను తిరస్కరించిన తర్వాత చమురు ధరలు మరింత పెరిగినట్లు మార్కెట్‌ నివేదికలు పేర్కొన్నాయి.

ADVERTISEMENT