Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు లభించడం వల్ల మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఐటీ, మెటల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి మార్కెట్ సూచీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.29 డాలర్లు
ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 351 పాయింట్లు పడిపోయి 72,732 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు తగ్గి 21,997 వద్ద ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, టీసీఎస్, అదానీ పోర్ట్స్, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో ఉన్నాయి
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.29 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 2,900.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.40 వద్ద ఉంది.
వివరాలు
అమెరికా మార్కెట్లపై ట్రంప్ నిర్ణయం ప్రభావం
ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయంతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా క్షీణించాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి డోజోన్స్ 1.48 శాతం, ఎస్‌అండ్‌పీ 1.76 శాతం, నాస్‌డాక్ 2.64 శాతం తగ్గిపోయాయి.
ఈ ప్రతికూల ప్రభావం ఆసియా-పసిఫిక్, ఆస్ట్రేలియా మార్కెట్లపైనా పడింది. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.65 శాతం, జపాన్ నిక్కీ 1.82 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.36 శాతం మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే, షాంఘై సూచీ మాత్రం స్థిరంగా ఉంది.
సోమవారం, విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మొత్తం ₹4,788 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) ₹8,791 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.