Stock Market : స్వల్ప లాభంతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 172 పాయింట్లు పెరిగి 79,389 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 24,048 వద్ద కొనసాగుతోంది.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.78గా ఉంది.
నిఫ్టీ సూచీలో టైటాన్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, కొటక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, సిప్లా సంస్థల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
వివరాలు
సూచీలపై సానుకూలంగా విశ్లేషకులు
విదేశీ పెట్టుబడిదారుల ధోరణి, అలాగే గురువారం నుంచి ప్రారంభం కానున్న దేశీయ కార్పొరేట్ సంస్థల ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
డిసెంబరు త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కొందరు విశ్లేషకులు సూచీలపై సానుకూలంగా ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్న విధానాలపై ఇంకా స్పష్టత లేకపోవడం, మన దేశీయ షేర్ల ధరలు అధికంగా ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతుండటంతో, మార్కెట్లు ఎక్కువగా రాణించకపోవచ్చని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.