
Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాట మధ్యలో కొనసాగుతున్నాయి. మొదట్లో లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమవుతున్నా,చివరకు నష్టాలతో ముగుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్పష్టతలేని సంకేతాల నేపథ్యంలో శుక్రవారం దేశీయ సూచీలు స్థిరంగా కదలాడుతున్నాయి. శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 83,269 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో నిఫ్టీ 8.6 పాయింట్లు పెరిగి 25,413 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.85.36 వద్ద స్థిరంగా ఉంది. నిఫ్టీ సూచీలో బజాజ్ ఫైనాన్స్,బజాజ్ ఫిన్‌సర్వ్,భారత్ ఎలక్ట్రానిక్స్,విప్రో,శ్రీరామ్ ఫైనాన్స్ వంటి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
వివరాలు
మిశ్రమ ధోరణిని ప్రదర్శిస్తున్న ఆసియా మార్కెట్లు
మరోవైపు ట్రెంట్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇక గత ట్రేడింగ్ రోజు అయిన గురువారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అయితే నేటి ఆసియా మార్కెట్లు మిశ్రమ ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. కొన్ని సూచీలు లాభాల దిశగా కదులుతుండగా, మరికొన్నింటిలో స్వల్ప నష్టాలున్నాయి.