Page Loader
Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 
నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2025
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ మార్కెట్లను ఈ వారం కూడా బేర్‌ పట్టు విడిచి పెట్టలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు, రూపాయి బలహీనత తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అదేవిధంగా కార్పొరేట్‌ సంస్థల డిసెంబరు త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటం మదుపర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా సోమవారం ట్రేడింగ్‌ను సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లు కుంగిపోయి, నిఫ్టీ 22,900 మార్క్‌ దిగువకు పడిపోయింది. ఉదయం 9.30 గంటల సమయానికి, సెన్సెక్స్‌ 318.52 పాయింట్లు తగ్గి 75,633.85 వద్ద, నిఫ్టీ 94.7 పాయింట్ల నష్టంతో 22,834.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

వివరాలు 

 మిశ్రమంగా ఆసియా పసిఫిక్‌ మార్కెట్లు

రూపాయి మారకం విలువ డాలర్‌తో 86.68 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో సన్‌ ఫార్మా, హిందుస్థాన్‌ యునీలీవర్‌, సిప్లా వంటి షేర్లు ప్రదర్శనలో ఉన్నప్పటికీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, టాటాస్టీల్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఓఎన్జీసీ షేర్లు నష్టాల పాలయ్యాయి. ఆసియా పసిఫిక్‌ మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 0.29 శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.18 శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీ 0.23 శాతం మేర లాభపడాయి. అయితే, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.64 శాతం నష్టాలతో కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. డోజోన్స్‌ 0.37 శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.01 శాతం నష్టపోగా, నాస్‌డాక్‌ 0.41 శాతం లాభపడింది.