Page Loader
Stock Market: వరుసగా రెండోరోజు లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
వరుసగా రెండోరోజు లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

Stock Market: వరుసగా రెండోరోజు లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ.. మంగళవారం దేశీయ సూచీలు సానుకూల దిశగా కదలాడుతున్నాయి. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావం మార్కెట్లపై కనిపిస్తోంది. ఉదయం 9.34 గంటల సమయంలో సెన్సెక్స్‌ 162 పాయింట్లు పెరిగి 82,362 వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

నిఫ్టీ @ 25,115

నిఫ్టీ కూడా 25 పాయింట్ల లాభంతో 25,115 వద్ద కొనసాగుతోంది. ట్రెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.25గా ఉంది. మరోవైపు శ్రీరామ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసిన నేపథ్యంలో.. ఆసియా మార్కెట్లు కూడా నేడు అదే దిశగా కదులుతున్నాయి.