
Stock Market: పుంజుకున్నా స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1800 పాయింట్లు పెరుగుదల!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయంగా వచ్చిన సానుకూల సంకేతాలు, భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వంటి కీలక పరిణామాలు మార్కెట్లకు ఉత్సాహాన్ని అందించాయి.
దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపారు. ఫలితంగా మార్కెట్‌లో బుల్ జోష్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 1,847 పాయింట్ల లాభంతో 81,313 స్థాయిలో ట్రేడవుతోంది.
Details
లాభాల్లో శ్రీరామ్ ఫైనాల్స్, జియో ఫైనాల్స్
నిఫ్టీ కూడా 571 పాయింట్లు ఎగబాకి 24,579 వద్ద కొనసాగుతోంది.
ప్రధానంగా జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టుబ్రో, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు మదుపర్లను ఆకట్టుకుంటూ లాభాల్లో ఉన్నాయి.
అయితే, సిప్లా షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
మొత్తం మీద మార్కెట్ ట్రెండ్ పాజిటివ్‌గా ఉండగా, ముందున్న రోజుల్లో కూడా ఇదే ఊపు కొనసాగుతుందేమో అనే ఉత్కంఠ మదుపర్లలో నెలకొంది.