Page Loader
Swiggy: స్విగ్గీ ఎంట్రీ.. జొమాటోకు పోటీగా డైనింగ్‌, టికెట్ బుకింగ్‌ అప్లికేషన్‌
స్విగ్గీ ఎంట్రీ.. జొమాటోకు పోటీగా డైనింగ్‌, టికెట్ బుకింగ్‌ అప్లికేషన్‌

Swiggy: స్విగ్గీ ఎంట్రీ.. జొమాటోకు పోటీగా డైనింగ్‌, టికెట్ బుకింగ్‌ అప్లికేషన్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2024
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కొత్త సేవలతో మళ్లీ ముందుకొచ్చింది. క్విక్‌ కామర్స్‌ విభాగంలో ఇప్పటికే రాణిస్తున్న స్విగ్గీ, తాజాగా డైనింగ్‌, లైవ్ ఈవెంట్స్‌, టికెట్‌ బుకింగ్‌ల రంగంలో కూడా ప్రవేశించడానికి సిద్ధమైంది. ఈ కొత్త సేవల కోసం స్విగ్గీ 'Scenes' అనే ప్రత్యేక యాప్‌ను విడుదల చేసింది. ఇదే తరహాలో జొమాటో కూడా 'డిస్ట్రిక్ట్' అనే యాప్‌ను రిలీజ్ చేసింది. ఇది డైనింగ్‌, టికెట్ బుకింగ్ వంటి సేవలను అందిస్తోంది. స్విగ్గీ ఈ విభాగంలో పోటీని ఎదుర్కొనడానికి 'Scenes' యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు పార్టీలు, లైవ్ మ్యూజిక్, డీజే నైట్స్‌, రెస్టారెంట్లలో జరిగే ఈవెంట్ల కోసం టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

Details

సినిమా టికెట్లు పొందే అవకాశం

అయితే ఈ యాప్‌లో సినిమా టికెట్ల విక్రయం సదుపాయం అందుబాటులో లేదు. స్విగ్గీ ఈ కొత్త సేవల ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ కొత్త సేవలు యూజర్ల సంఖ్యను పెంచడంలో కూడా సాయపడతాయని సంస్థ ప్రకటించింది. ప్రాథమికంగా ఈ సేవలు బెంగళూరులో ప్రారంభం కానున్నాయి, త్వరలోనే ఇతర నగరాల్లో కూడా అందుబాటులో రానున్నాయి. ప్రస్తుతం స్విగ్గీ, వార్షిక 10 శాతం వృద్ధితో దూసుకెళ్తుంది. ఇక మెరుగైన సేవలు కోరుకునే వినియోగదారుల కోసం 'One BLCK' పేరిట కొత్త మెంబర్‌షిప్‌ ప్లాన్‌ను స్విగ్గీ ప్రవేశపెట్టింది. ఈ సభ్యత్వంతో ప్రతి ఆర్డర్‌పై ఫాస్ట్‌ డెలివరీ, ఆన్‌-టైమ్‌ గ్యారెంటీ అందించే హామీ ఉంది.