LOADING...
Swiggy New App Toing : స్టూడెంట్స్ కోసం.. స్విగ్గీ కొత్త డెలివరీ యాప్ 'టోయింగ్'! 
స్టూడెంట్స్ కోసం.. స్విగ్గీ కొత్త డెలివరీ యాప్ 'టోయింగ్'!

Swiggy New App Toing : స్టూడెంట్స్ కోసం.. స్విగ్గీ కొత్త డెలివరీ యాప్ 'టోయింగ్'! 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2025
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టూడెంట్స్, యువతను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని స్విగ్గీ కొత్త యాప్‌ను లాంఛ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ యాప్‌లోని ఫుడ్ ఐటెమ్స్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి, కేవలం రూ. 100 నుంచి రూ. 150 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరల్లో ఫుడ్‌ను త్వరగా డెలివరీ చేయడానికి ప్రత్యేకంగా ఈ యాప్ రూపొందించబడింది. ఇందులో సర్జ్ ఛార్జీలు ఉండవు, అంటే అదనపు చార్జీలు లేవు. స్విగ్గీ ప్రకారం, చిన్న చిన్న ఐటెమ్స్‌ను వేగంగా డెలివరీ చేయడం ఈ యాప్ ప్రధాన లక్ష్యం.

వివరాలు 

స్టూడెంట్స్ కోసం ప్రత్యేకం: 

సిటీలో చదువుతున్న విద్యార్థులు, తక్కువ ఆదాయం కలిగిన యువత తక్కువ ధరల్లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారని స్విగ్గీ పేర్కొంది. వారికోసమే ఈ యాప్ ప్రత్యేకంగా రూపొందించబడింది.ఇక,స్విగ్గీ యాప్ లో ఉండే రూ.99స్టోర్‌ కంటే ఎక్కువ ఆప్షన్లు ఈ టోయింగ్ యాప్ లో ఉంటాయి. చార్జీలు తక్కువ: ఈ యాప్‌లో మినీ మీల్స్,బర్గర్లు,శాండ్‌విచ్‌లు,కేక్స్,డిజర్ట్‌లు వంటి పలు ఫుడ్ ఐటెమ్స్ అందుబాటులో ఉంటాయి. స్విగ్గీ యాప్‌తో పోలిస్తే,ప్లాట్‌ఫామ్ ఫీజు కూడా కొంత తగ్గించబడింది. అదేవిధంగా, రూ. 99 లోపు ఫ్లాష్ డీల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త యాప్ పింక్,గ్రీన్ కలర్ థీమ్లో ఉంటుంది.ప్రస్తుతానికి,టోయింగ్ పూణే, కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.త్వరలో ఇది అన్ని సిటీలలో లభ్యమవుతుంది.