Swiggy: స్విగ్గీలో ప్రీమియం మెంబర్‌షిప్.. ధర, ఫీచర్లు వివరాలివే!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కొత్త మెంబర్‌షిప్ ప్లాన్‌ను 'One BLCK' పేరిట ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక ప్లాన్ వినియోగదారులకు మెరుగైన సేవలు, సౌలభ్యం అందించేందుకు రూపొందించింది. అయితే ఈ మెంబర్‌షిప్‌ను పొందాలంటే వినియోగదారులు స్విగ్గీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన వినియోగదారులు మాత్రమే ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందగలుగుతారు. స్విగ్గీ 'One BLCK' ప్లాన్‌లో సభ్యుల కోసం ప్రత్యేక సేవలున్నాయి. ప్రతి ఆర్డర్‌పై ఫాస్ట్ డెలివరీ, ఆన్-టైమ్ గ్యారంటీ, డైన్ఔట్ సమయంలో కాంప్లిమెంటరీ కాక్‌టెయిల్స్, డ్రింక్స్, డెజర్ట్స్ వంటి ఆఫర్లు అందిస్తారు. అలాగే 'ఇన్‌స్టామార్ట్' లో ఉచిత డెలివరీలు, డైన్‌అవుట్ పై ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు 'స్విగ్గీ వన్' మెంబర్‌షిప్ ప్రయోజనాలు అందిస్తారు.
అదనంగా యాత్రా ప్రైమ్ మెంబర్‌షిప్
అగ్ర భాగస్వామి బ్రాండ్‌లతో ప్రత్యేకమైన ఆఫర్లను కూడా పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి బ్రాండ్‌లతో భాగస్వామ్యం ద్వారా వినియోగదారులు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ లాంచ్ ఆఫర్ సమయంలో వన్ బ్లాక్ సభ్యులకు కాంప్లిమెంటరీగా యాత్రా ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తారని స్విగ్గీ వెల్లడించింది. స్విగ్గీ వన్ బ్లాక్ 3 నెలల ప్లాన్ ధర రూ.299గా పేర్కొంది. ఈ మెంబర్‌షిప్ ద్వారా ప్రస్తుతం స్విగ్గీ వన్ సభ్యులుగా ఉన్నవారు కూడా అప్‌గ్రేడ్ చేయించుకోవచ్చు.