LOADING...
Tata Capital IPO: టాటా క్యాపిటల్‌ ఐపీఓకి గ్రిన్‌సిగ్నల్‌.. రూ.15 వందల కోట్ల లక్ష్యంతో సెబీకి దరఖాస్తు
టాటా క్యాపిటల్‌ ఐపీఓకి గ్రిన్‌సిగ్నల్‌.. రూ.15 వందల కోట్ల లక్ష్యంతో సెబీకి దరఖాస్తు

Tata Capital IPO: టాటా క్యాపిటల్‌ ఐపీఓకి గ్రిన్‌సిగ్నల్‌.. రూ.15 వందల కోట్ల లక్ష్యంతో సెబీకి దరఖాస్తు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2025
02:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌కి చెందిన ఫైనాన్షియల్‌ సేవల సంస్థ టాటా క్యాపిటల్ తన తొలి పబ్లిక్‌ ఇష్యూ (Tata Capital IPO)కి సిద్ధమవుతోంది. రూ.15,000 కోట్ల నిధులను సమీకరించేందుకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి కాన్ఫిడెన్షియల్‌ ప్రీ-ఫైలింగ్‌ రూట్‌లో DRHP దాఖలు చేసింది. ఈ నిధుల సమీకరణ కొత్త షేర్ల జారీతో పాటు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS)రూపంలోనూ జరగనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా టాటా క్యాపిటల్‌ను అప్పర్ లేయర్‌ NBFCగా గుర్తించింది. అందువల్ల 2025 సెప్టెంబర్‌ లోపు లిస్టింగ్ చేయాల్సిన బాధ్యత ఈ సంస్థపై ఉంది. తాజా DRHP ప్రకారం 2.3 కోట్ల ఈక్విటీ షేర్లను ఫ్రెష్ ఇష్యూగా, అలాగే ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను తగ్గించుకునేలా OFS పద్ధతిలో నిధులు సమీకరించనున్నారు.

Details

టాటా సన్స్‌కు 93 శాతం వాటా

ప్రస్తుతానికి టాటా క్యాపిటల్‌లో టాటా సన్స్‌కు 93 శాతం వాటా ఉంది. సెబీ నుంచి ఆమోదం లభించి టాటా క్యాపిటల్ IPO వస్తే, ఇది ఫైనాన్షియల్ సెక్టార్‌లో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలో ఒకటిగా నిలవనుంది. అంతేకాక, టాటా గ్రూప్ నుంచి వచ్చిన రెండో అతిపెద్ద IPOగా మారుతుంది. గతంలో టాటా టెక్నాలజీస్ (2023 నవంబర్) IPO మార్కెట్‌లో దూసుకెళ్లింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో టాటా క్యాపిటల్ రూ.18,178 కోట్ల ఆదాయం, రూ.3,150 కోట్ల నికర లాభం నమోదు చేసింది. సంస్థ లోన్‌ బుక్‌ రూ.లక్ష కోట్లను దాటి వృద్ధిపథంలో ఉంది. టాటా క్యాపిటల్‌ IPO ఫైనాన్షియల్ మార్కెట్‌లో భారీ హైప్‌ను తెచ్చే అవకాశం ఉంది.