Page Loader
Budget 2025: విదేశీ ఖర్చులకు టీసీఎస్‌ పరిమితి పెంపు.. రూ.10 లక్షలు పంపితేనే పన్ను వసూలు
విదేశీ ఖర్చులకు టీసీఎస్‌ పరిమితి పెంపు.. రూ.10 లక్షలు పంపితేనే పన్ను వసూలు

Budget 2025: విదేశీ ఖర్చులకు టీసీఎస్‌ పరిమితి పెంపు.. రూ.10 లక్షలు పంపితేనే పన్ను వసూలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2025
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

విదేశాల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు పెద్ద ఊరట లభించింది. ప్రయాణాలు, వైద్య ఖర్చులు, పెట్టుబడుల కోసం భారత్‌ నుంచి విదేశాలకు పంపే డబ్బులపై మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్‌) పరిమితిని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఆర్థిక సంవత్సరానికి రూ.7 లక్షలకు మించిన మొత్తం పంపినప్పుడే టీసీఎస్‌ వర్తించేది. తాజా బడ్జెట్‌ ప్రకారం, ఈ పరిమితి రూ.10 లక్షలకు పెంచారు. చిన్న మొత్తాల లావాదేవీలపై పన్ను భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రూ.10 లక్షలకు మించిన నగదు బదిలీపై కొత్త టీసీఎస్ రేట్లు విదేశీ పెట్టుబడులు, ప్రయాణాలపై 20% టీసీఎస్‌ విద్యా అవసరాల కోసం పంపించే నిధులకు టీసీఎస్‌ పూర్తిగా తొలగింపు

Details

 ప్రవాస భారతీయులకు మరో ఊరట 

ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న లేదా నిర్వహిస్తున్న దేశీయ కంపెనీలకు సేవలు అందిస్తున్న ప్రవాస భారతీయుల కోసం ఊహాత్మక (ప్రిజంప్టివ్‌) పన్ను విధానాన్ని ప్రతిపాదించారు. ఈ మార్పులతో విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది. అదే విధంగా విదేశీ పెట్టుబడులు, వ్యాపార ప్రయాణాలకు సంబంధించి పన్ను విధానంలో స్పష్టత వచ్చింది