Page Loader
TCS Q3 Results: త్రైమాసిక ఫలితాల్లోఅదరగొట్టిన టీసీఎస్‌.. రూ.12380 కోట్ల నికర లాభం నమోదు
త్రైమాసిక ఫలితాల్లోఅదరగొట్టిన టీసీఎస్‌.. రూ.12380 కోట్ల నికర లాభం నమోదు

TCS Q3 Results: త్రైమాసిక ఫలితాల్లోఅదరగొట్టిన టీసీఎస్‌.. రూ.12380 కోట్ల నికర లాభం నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన తాజా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో, కంపెనీ రూ.12,380 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి మార్కెట్ అంచనాలను అందుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో, కంపెనీ రూ.11,058 కోట్ల లాభం సాధించినప్పటికీ, ఈసారి నికర లాభం 12 శాతం పెరిగింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం‌తో పోలిస్తే, గత త్రైమాసికంలో రూ.11,909 కోట్ల లాభం నమోదైనది.

వివరాలు 

బీఎస్‌ఈలో కంపెనీ షేరు విలువ 1.72 శాతం తగ్గింది 

ఆదాయం విషయానికొస్తే, గతేడాది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ.60,583 కోట్లు కాగా, ఈసారి అది రూ.63,973 కోట్లు చేరింది, అంటే 5.6 శాతం పెరుగుదల ఏర్పడింది. సెప్టెంబర్ ముగిసిన త్రైమాసికంలో ఆదాయం రూ.64,988 కోట్లుగా నమోదైంది. ఫలితాల సందర్భంగా, కంపెనీ ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్, అలాగే రూ.66 స్పెషల్ డివిడెండ్ ప్రకటించింది. ఈ ఫలితాలు వెల్లడైన తర్వాత, బీఎస్‌ఈలో కంపెనీ షేరు విలువ 1.72 శాతం తగ్గి, రూ.4036.65 వద్ద ముగిసింది. ఇక, ఇతర ముఖ్యమైన వివరాలు: సమీక్షా త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 5,000 తగ్గినట్లు కంపెనీ తెలిపింది. డిసెంబర్ నెలాఖరున కంపెనీకి చెందిన మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,07,354కి చేరుకున్నట్లు వెల్లడించింది.